సైరాకు పవన్ మరో సాయం..

సైరాకు పవన్ మరో సాయం..

0
89

సైరా నరసింహ రెడ్డి చిత్రంకు సంబంధిచిన టీజర్ నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్సినా మేకింగ్ వీడియోను, కొన్ని ఫోటోలని బయటకు వదలగా ఆ ఫోటోలకు ఫ్యాన్స్ పీఛెక్కి పోతున్నారు. మెగా మూవీ స్థాయి పెంచేలా వాయిస్ ఓవర్ ఉంటుందని ఇప్పటికే ఖరారు అయింది.

ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఇవ్వడం తో పాటు మరో సాయం కూడా చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సైరా చిత్రం ప్రమోషన్లో భాగాంగా నిర్వహించబోతున్నా ఫ్యాన్స్ మీటుకు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. హైదరాబాద్ శిల్ప కళా వేదికలో చిరంజీవి పుట్టిన రోజు వేసుకలు నిర్వహించేందుకు మెగా ఫాన్స్ ఈ మీట్ ను వారే ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో నాగబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు.