Flash- టీఆర్ఎస్ నాయకులను విడిచిపెట్టని కరోనా..ఎంపీ రంజిత్‌ రెడ్డికి పాజిటివ్

Corona not leaving TRS leaders..Corona positive for another MP

0
70

టీఆర్ఎస్ నాయకులను కరోనా విడిచిపెట్టడం లేదు. నిన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

తాజాగా మరో టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని చెప్పారు.