టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ నాగచైతన్య, సమంతలు విడిపోయి మూడు నెలలు కావస్తుంది. చూడముచ్చటి ఈ జంట తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో ఇండస్ట్రీతో పాటు, అభిమానులు కూడా షాక్ అయ్యారు. వివాహ బంధం నుంచి బయటకు వచ్చిన వీరిద్దరూ ప్రస్తుతం తమ, తమ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
తాజాగా నాగచైతన్య ప్రస్తుతం బంగార్రాజు సినిమా షూటింట్‌లో బిజీగా ఉన్నాడు. ఇక సమంత యశోద సినిమా చేస్తోంది. ఈ రెండు చిత్రాల షూటింగ్ రామనాయుడు స్టూడియోలో జరిగింది. దీంతో అనుకోని పరిస్థితుల్లో చై, సామ్ ఒకే చోట ఉండాల్సి పరిస్థితి వచ్చింది.
అయితే వీరిద్దరూ ఒకేచోట ఉన్నా కనీసం ఒకరిని ఒకరు చూసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయం ముందుగానే తెలిసిన జంట ఒకరికి ఒకరు తారసపడకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తుంది. ఈ విషయమై తమ సిబ్బందికి డైరెక్షన్స్ ఇచ్చారని చర్చ జరుగుతోంది.