ఒమిక్రాన్​ టెన్షన్..బూస్టర్​ డోసుగా ఏ వ్యాక్సిన్ ఉత్తమం అంటే?

Omicron Tension..Which vaccine is best for booster dose?

0
85

ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఇటీవల బూస్టర్​ డోసుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్​ తీసుకున్న వారు కొవావాక్స్​ను బూస్టర్​గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొవిషీల్డ్​కు కొవావాక్స్​ మంచి బూస్టర్​గా పనిచేస్తున్నట్లు వైరాలజిస్ట్​ డాక్టర్​ షహీద్​ జమీల్​ పేర్కొన్నారు. ​ఇతర వ్యాక్సిన్​ కాంబినేషన్లపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదన్నారు.

మరో ప్రముఖ వైరాలిజిస్ట్​ గగన్​దీప్ కంగ్​ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. భారత్​లో ప్రస్తుతం మూడో డోసుకు ఏ వ్యాక్సిన్​ తీసుకోవాలి అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదని.. కానీ యూకేకు చెందిన ఓ సంస్థ పరిశోధనలో కొవిషీల్డ్​కు కొవావాక్స్​ మెరుగైన బూస్టర్​ అని తేలిందన్నారు.

అయితే ప్రస్తుతం దేశంలో మూడో డోసుగా ఇతర వ్యాక్సిన్​ వినియోగంపై కేంద్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం.. ‘ముందు జాగ్రత్త డోసు’గా అంతకుముందు రెండు డోసులు ఏవి తీసుకున్నారో అదే మూడో డోసుగా తీసుకోవాలని పేర్కొంది.