టీడీపీ ఎమ్మెల్యేకు ఝలక్

టీడీపీ ఎమ్మెల్యేకు ఝలక్

0
89

ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు ఘోర అవమానాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది…. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ముంపు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే… అయితే దానిని టీడీపీ నాయకులు అయుదంగా చేసుకుని అధికార వైసీపీ నాయకులపై విమర్శలు చేయాలని చూశారు.

కానీ వారే బొక్కబోర్ల పడుతున్నారు… తాజాగా టీడీపీ ఎమ్మెల్యేకు అదే పరిస్ధితి తలెత్తింది… పెనుమూడిపల్లెపాలెం గ్రామానికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వెళ్లి అక్కడి ప్రజలను పారామర్శించారు… ఈ వదలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ గ్రామస్తులను సత్యప్రసాద్ కోరారు.

దానిపై బాధితులు స్పందిస్తూ తమకు ప్రభుత్వం ఏదో కొంతైనా సహాయం చేస్తోంది మీరు అధికారంలోకి ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పండని, కనీసం ఈ చుట్ట ప్రక్కలకు వచ్చారా అని బాధితులు ప్రశ్నించారు..