కుక్కర్‌లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే?

Is rice cooked in a cooker good for health? What do health experts say?

0
92

సాధారణం చాలా మంది ఇళ్లలో కానీ రూంలలో అన్నం ప్రెషర్‌ కుక్కర్లో వండుతుంటారు. ప్రెషర్‌ కుక్కర్లు లేని సమయంలో కట్టెల పొయ్యిపై, ఆ తర్వాత గ్యాస్‌ సిలిండర్‌పై గిన్నెలోనే వండేవారు. ఇప్పుడు కాలం మారుతున్నకొద్ది విధానాన్ని మార్చుకుంటున్నారు.

ప్రెషర్‌ కుక్కర్లలో వండే వారు చాలా మందే ఉన్నారు. దీని వల్ల గ్యాస్‌ ఆదా కావడమే కాకుండా అన్నం త్వరగా అవుతుంది. మన దేశంలో అన్నం ప్రధానమైనది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా చాలా మంది తీసుకుంటారు. అయితే ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం వండితే ఆరోగ్యానికి మంచిదేనా..? కాదా అన్న సందేహం కలుగుతుంటుంది. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే?

ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిదేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రెషర్‌ కుక్కర్‌లో వండే అన్నం రుచిగా ఉండడమే కాకుండా కుక్కర్‌లో వండిన అన్నంలో పిండి పదార్థం తొలగిపోతుందట. అంతేకాకుండా ఫ్యాట్‌ కంటెంట్‌ కూడా తక్కువగా ఉంటుంది. కుక్కర్‌లో వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్‌ లాంటి నీటిలో కలిగే పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక కుక్కర్‌లో వండిన అన్నంతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు. అన్నం సులువగా జీర్ణమవుతుంది. ఈ అన్నంలో ప్రోటీన్స్‌, పిండి పదార్థాలు, ఫైబర్‌ కంటెంట్‌ లాంటి పోషకాలు కూడా ఉంటాయట. ప్రెషర్‌ కుక్కర్‌లో వండటం వల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హనికర బ్యాక్టీరియా నశించిపోతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.