డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్..ఇక నుండి ఇంట్లోనే చేసుకోండిలా..

Good news for those who want to get a driving license

0
74

రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు మాదిరిగానే డ్రైవింగ్ లైసెన్స్ కూడా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ఏ వెహికల్ అయినా రోడ్లపై డ్రైవ్ చేయడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా నడిపితే మాత్రం అది చట్ట విరుద్ధం అవుతుంది. జరిమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. టైమ్ బాగోలేకపోతే ఇంకా ఏమైనా జరగొచ్చు.

ఇక డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం ఇప్పుడు సులభతరంగా మారింది. గతంలో ఉన్న నిబంధలన్ని మారిపోయాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఇంట్లోనే ఉండి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా ఏ రాష్ట్రానికి చెందిన వారు అయినా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ వెబ్‌సైట్‌లో తెలంగాణ రాష్ట్రం పేరు మాత్రం లేదు.

మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలని భావిస్తే.. పరివాహన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఈ లింక్ ద్వారా https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do వెబ్‌సైట్‌కు వెళ్లొచ్చు. సెలెక్ట్ యువర్ స్టేట్ నేమ్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ అప్షన్ ఓకే చేయాలి. ఇప్పుడు మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇందులో పలు రకాల సేవల అందుబాటులో ఉంటాయి. ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఇంకా చాలా రకాల సేవలు లభిస్తాయి.

ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు ఏ ఏ డాక్యుమెంట్లు అవసరమో కనిపిస్తాయి. అప్లికేషన్ ఫిల్ చేయాలి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి, ఫోటో, సిగ్నేచర్ వంటివి కూడా అవసరం అవుతాయి. అలాగే పేమెంట్ ఫీజు కట్టాలి. డబ్బులు చెల్లించాలి. తర్వాత రశీదు ప్రింట్ తీసుకోవాలి. అయితే ఆధార్ కార్డు కచ్చితంగా కావాలి. కాగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలని భావించే వారి వద్ద కచ్చితంగాలెర్నర్స్ లైసెన్స్ నెంబర్ ఉండాలి.