మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. మెగాస్టార్ కెరీర్‌లో 153వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్ , పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
ఇక ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం మూవీని రీమేక్ తో రాబోతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు భోళా శంకర్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ కు చెల్లెలుగా కనిపించనుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
వీటితో పాటు దర్శకుడు బాబీ డైరెక్షన్ లో చిరు సినిమా ఓకే చేశారు. ఈ సినిమా మాస్ మసాలా కథతో తెరకెక్కనుంది. ఈ సినిమాలో మెగాస్టార్ మత్యకారుడిగా కనిపించనున్నారని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా హీరోయిన్ గా ఇప్పుడు ఓ బ్యూటీని ఎంపిక చేశారని తెలుస్తుంది. ఈ సినిమా మెగాస్టార్ తో రొమాన్స్ చేయండని శ్రుతిహాసన్ రంగంలోకి దిగుతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.