సరదా ఆట ప్రాణాలు తీస్తున్నాయి. మొబైల్ గేమ్స్ కొంతమంది పాలిట శాపంలా మారింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది పబ్‌జీ బారినపడి జీవితాలు పణంగా పెడుతున్నారు. వీడియోగేమ్‌లకు ఆడిక్టయి చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.
రాజస్థాన్, జైపుర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పబ్ జి ఇద్దరు అన్నదమ్ములను బలిగొంది.వారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ‘లోకేశ్ మీనా, రాహుల్ అనే ఇద్దరు సోదరులు వాళ్ల అక్క ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు.
ఖాళీ సమయంలో పబ్‌జీ ఆడుతూ కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలో రూప్బాస్ పట్టణం సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని ఫోన్లో పబ్‌జీ ఆటలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఆ మార్గంలో రైలు వచ్చింది. ట్రైన్‌ను గమనించని అన్నదమ్ములు అలాగే ఆటలో పూర్తిగా లీనమయ్యారు. దీంతో రైలు వారిని ఢీకొట్టింది’. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడ దుర్మరణం చెందారు.