డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శిగా, స్పేస్ కమిషన్ ఛైర్మన్‌గా ఎస్.సోమ్‌నాథ్ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఇస్రో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ బాధ్యతలు చేపట్టకముందు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరక్టర్‌గా సోమ్‌నాథ్ సేవలు అందించారు.
ఇప్పటికే జీఎస్ఎల్వీ ఎంకే- 3 అభివృద్ధికి అందించిన సేవలకు గాను సోమ్‌నాథ్ టీమ్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా మెరిట్ అవార్డ్, పర్ఫామెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్‌లతో ఇస్రో.. స్పేస్ గోల్డ్ మెడల్, నేషనల్ ఏరోనాటిక్స్ ప్రైజ్‌తో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సత్కరించాయి.
ప్రస్తుతమున్న ఇస్రో ఛైర్మన్ శివన్ అతి త్వరలోనే పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. సోమ్‌నాథ్‌ను ఆయన వారసుడిగా ఇటీవలే ఎంపిక చేసింది నియామకాల కేబినెట్ కమిటీ. టర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫేడరేషన్ బ్యూరోలో సోమ్‌నాథ్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.