రాష్ట్రంలో 30వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలను బంద్ ఉంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఆదివారం విద్యాశాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో ముందుగా విద్యాసంస్థలను 20 వరకు పొడిగించాలని భావించారు.
కానీ అలా కాకుండా ఎక్కువ రోజులు పొడిగిస్తే బాగుంటుందని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎక్కువ రోజులు పొడిగించినట్లయితే పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది.