కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్, ఇతర ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.
ఇక తాజాగా ఏపీలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,673 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,955 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అంటే ఇన్నటి కంటే 400లకుపైగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కోవిడ్ నుంచి కొత్తగా 397 మంది కోలుకున్నారు. కరోనాతో కొత్తగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 212
చిత్తూరు 1039
ఈస్ట్ గోదావరి 303
గుంటూరు 326
వైస్సార్ కడప 377
కృష్ణ 203
కర్నూల్ 323
నెల్లూరు 397
ప్రకాశం 190
శ్రీకాకుళం 243
విశాఖపట్నం 1103
విజయవాడ 184
వెస్ట్ గోదావరి 55