తెలంగాణలో కరోనా టెన్షన్..హెల్త్ బులెటిన్ రిలీజ్..ఎన్ని పాజిటివ్ కేసులంటే?

Corona tension in Telangana..Health bulletin release..how many positive cases?

0
112
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,073 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1963 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,07,162కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది.

కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,054కు చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 1,620 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,017 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 1,075 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 96.31 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది.