సంక్రాంతి పండుగ వేడుకలను సినీ నటులు ఘనంగా జరుపుకుంటున్నారు. తాజాగా హిందూపురం టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడిపారు. తన సోదరి పురంధరేశ్వరి సొంతూరు కారంచేడుకు బాలయ్య కుటుంబం వెళ్లింది. ఇక అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది బాలయ్య కుటుంబం.
నిన్న గుర్రం ఎక్కి సందడి చేసిన నందమూరి బాలయ్య… తాజాగా తన భార్య వసుంధరతో కలిసి.. జీప్ లో తిరిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్యను పక్కన కూర్చో బెట్టుకుని.. ఆయన స్వయంగా జీప్ నడిపారు. టాప్ లెస్ ఫోర్డ్ జీప్ లో కాసేపు అక్కడ తిరిగి, అనంతరం కుటుంబ సభ్యులతో బీచ్ లో కాసేపు గడిపారు బాలయ్య. ఇక ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కాగా.. ఇటీవల నందమూరి బాలయ్య నటించిన అఖండ సినిమా బంపర్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే.
మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అనీల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్నారు బాలయ్య. ఈ టాక్ షో రికార్డు స్థాయి రేటింగ్ తో దూసుకుపోతుంది.