ఇండియన్‌ ఆర్మీకి కొత్త యూనిఫాం..ఈ మార్పు ఎందుకో తెలుసా?

Indian‌ Army new uniform..do you know why this change?

0
114

భారత సైన్యం ఇకపై కొత్త యూనిఫాంను ధరించనుంది. ఆధునికత వైపు క్రమంగా అడుగులు వేస్తున్న క్రమంలో యూనిఫాం విషయంలోనూ కొత్త సొబగులు అద్దుకుంటోంది. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వీటిని తొలిసారి ప్రదర్శించనున్నారు. జవాన్లకు మరింత సౌకర్యం కలిగించేలా, యుద్ధ క్షేత్రంలో శత్రువులను మెరుగ్గా ఏమార్చేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు.

ప్రస్తుతం సైన్యం వాడే పోరాట దుస్తులు బహిరంగ మార్కెట్‌లోనూ లభ్యమవుతున్నాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలోని భద్రతా విభాగాలూ వాటిని విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఆ శాఖల సిబ్బందిని కూడా సైనికులుగా ప్రజలు పొరబడుతున్నారు. దీంతో శాంతి భద్రతల విధుల్లో సైన్యాన్ని వాడుతున్నారన్న అపోహలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త యూనిఫామ్ ను తీసుకొచ్చారు.

కొత్త యూనిఫాం 13 సైజుల్లో లభ్యమవుతుంది. వీటిని పూర్తిగా సైన్యానికే ప్రత్యేకించారు. భద్రతా కారణాల వల్ల పౌరులకు అందుబాటులో ఉంచరాదని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కొత్త యూనిఫాం దీర్ఘకాలం మన్నుతుంది. వేసవి, శీతాకాలాల్లో ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది. ఉతికినప్పుడు త్వరగా ఆరిపోతుంది.

ఈ కొత్త డ్రస్‌ను టక్‌ చేయరు. బెల్టు బయటకు కనిపించదు. లోపల టి షర్టు ధరించాలి. ప్యాంట్‌కు అదనపు జేబులు ఉంటాయి. ప్యాంట్‌ దిగువ భాగం.. బూట్లలోకి ఒదిగిపోతుంది.

పోరాట దుస్తుల్లో ర్యాంకును సూచించే చిహ్నాలను భుజాలపై కాకుండా.. ముందు భాగంలో గుండీల వద్ద ప్రదర్శించే అవకాశం ఉంది. మెరుగైన కమోఫ్లాజ్‌ కోసం వాటిని నలుపు రంగులో ప్రదర్శిస్తారన్న అభిప్రాయమూ ఉంది.