వరుణ్​ తేజ్​-హరీశ్​​ శంకర్​ కాంబో రిపీట్?

0
80

మెగా హీరో వరుణ్​ తేజ్​-హరీశ్​​ శంకర్​ కాంబోలో గద్దలకొండ గణేష్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే కాంబో మళ్లీ రిపీట్​ కానుందా? అంటే అవుననే అనిపిస్తుంది. బుధవారం వరుణ్​ పుట్టినరోజు సందర్భంగా హరీశ్​ చేసిన ట్వీట్​ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.

గద్దలకొండ గణేష్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ హరీశ్​ మాట్లాడుతూ..”ఆ పాత్రలో నిన్ను ఊహించుకున్నప్పుడు నాకు తెలియదు.. నువ్వు ఆ పాత్రను ఎంతో కష్టపడి ఆ స్థాయిలో రక్తికట్టిస్తావని. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు ఎప్పుడూ ఆనందం కలిగించే విషయం. నీతో మరోసారి పనిచేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని అన్నారు. దీంతో వరుణ్​-హరీశ్​ కాంబోలో మరో సినిమా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.