గ్లెన్​ మ్యాక్స్​వెల్ ఊచకోత..41 బంతుల్లోనే సెంచరీ!

Glenn Maxwell Massacre..41 Ball Century!

0
34

ఆస్ట్రేలియా స్టార్​ బ్యాటర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​. బిగ్​బాష్​ లీగ్​లో అదరగొట్టాడు. హాబర్ట్​ హరికేన్స్​తో జరిగిన మ్యాచ్​లో మెల్​బోర్న్ స్టార్స్​ కెప్టెన్ మ్యాక్స్​వెల్​ సెంచరీతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

బౌండరీలు బాదుతూ హరికేన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. 64 బంతుల్లో 154 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్​లో 24 ఫోర్లు, నాలుగు సిక్స్​లు బాదాడు. ఈ లీగ్​ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

మరోవైపు మ్యాక్స్​వెల్​కు తోడు స్టోయినిస్​ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో మెల్​బోర్న్​ రెండు వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది. ఇప్పటివరకు బిగ్​బాష్​లీగ్​లో ఇదే అత్యధిక స్కోరు. హరికేన్స్​ బౌలర్లు జోష్​ఖాన్​, థామ్సన్​ చేరో వికెట్ పడగొట్టారు.​