‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ కొత్త రిలీజ్ డేట్స్ ఫిక్స్?

0
107

ఈసారి సంక్రాంతి సినిమాల సందడి తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ లాంటి భారీ బడ్జెట్​-పాన్ ఇండియా సినిమాలు వస్తాయనుకుంటే ‘రౌడీబాయ్స్’, ‘బంగార్రాజు’, ‘హీరో’ లాంటి చిత్రాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు.. ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి ఆలస్యమవుతూ వస్తుండటం వల్ల అభిమానుల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ మరోవైపు ఎప్పుడెప్పుడూ ఆ సినిమాలు చూస్తామా అనే ఆత్రుత కూడా ఉంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రాలు వాయిదా పడినప్పటి నుంచి కొత్త రిలీజ్ డేట్​ ఎప్పుడా అని అందరూ అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే అవి ఖరారైనట్లు తెలుస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఏప్రిల్ 29న లేదంటే జూన్ 3న థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మరోవైపు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ను మార్చి 18నే పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే.