ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. అలాగే ఏపీలో నిన్నటి కంటే ఇవాళ మరో వెయ్యి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,53, 268కి చేరింది.
ఒక్కరోజు వ్యవధిలో మరో ఐదుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 532 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 64, 136 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2942 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 74, 600 లక్షలకు చేరింది. ఇప్పటి దాకా 3, 20, 56, 618 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 1235
చిత్తూరు 1585
ఈస్ట్ గోదావరి 816
గుంటూరు 1054
వైస్సార్ కడప 649
కృష్ణ 338
కర్నూల్ 961
నెల్లూరు 1051
ప్రకాశం 772
శ్రీకాకుళం 1230
విశాఖపట్నం 2244
విజయవాడ 681
వెస్ట్ గోదావరి 596