సిద్దిపేట జిల్లాలో గ్రామాల లిస్ట్ ఇదే !

This is the list of villages in Siddipet district!

0
118

Regional Ring Road
సిద్దిపేట జిల్లాలో గ్రామాల లిస్ట్ ఇదే !

https://youtu.be/YcRlJDLPM5Q

తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ నిర్మితమవుతున్న గ్రామాల లిస్ట్ అధికార వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. తాజా సమాచారం మేరకు344 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం చేపట్టనుండగా తాజాగా ఉత్తర భాగంలో 158 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం కోసం నాలుగు జిల్లాల్లో 20 మండలాలోని 111 గ్రామాలను ఐడెంటిఫై చేశారు.
ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 5 మండలాల్లో… 23 గ్రామాలను గుర్తించారు. సిద్దిపేట జిల్లాలోని మండలాలు, గ్రామాల లిస్ట్ ఒకసారి పరిశీలిద్దాం.
బేగంపేట (రాయిపోల్ మండలం)
ఎల్కల్ (రాయిపోల్ మండలం)
బంగ్లా వెంకటాపూర్ (గజ్వేల్ మండలం)
మక్తామాసన్ పల్లె (గజ్వేల్ మండలం)
కోమటిబండ (గజ్వేల్ మండలం)
గజ్వేల్ (గజ్వేల్ మండలం)
సంగాపూర్ (గజ్వేల్ మండలం)
ముట్రాజ్ పల్లె (గజ్వేల్ మండలం)
ప్రజాపూర్ (గజ్వేల్ మండలం)
సిరిగిరిపల్లె (గజ్వేల్ మండలం)
మజీద్ పల్లె (వర్గల్ మండలం)
మెంటూర్ (వర్గల్ మండలం)
జబ్బాపూర్ (వర్గల్ మండలం)
మైలారం (వర్గల్ మండలం)
కొండాయిపల్లె (వర్గల్ మండలం)
మర్కూక్ (మర్కూక్ మండలం)
పాములపర్తి (మర్కూక్ మండలం)
అంగడికిష్టాపూర్ (మర్కూక్ మండలం)
చేబర్తి (మర్కూక్ మండలం)
ఎర్రవల్లి (మర్కూక్ మండలం)
అలీరాజ్ పేట (జగదేవ్ పూర్ మండలం)
ఇటిక్యాల (జగదేవ్ పూర్ మండలం)
పీర్లపల్లె (జగదేవ్ పూర్ మండలం)
ఉత్తరభాగంల నిర్మించనున్న 158 కిలోమీటర్ల రహదారికి భూసేకరణ పనులను ఇప్పటికే స్టార్ట్ చేశారు. దీనికోసం 4620 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సంగారెడ్డి జిల్లాలో 1250 ఎకరాలు, మెదక్ జిల్లాలో 1125 ఎకరాలు అవసరం అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో ఎంత భూమి సేకరించాల్సి ఉంటుందనే క్లారిటీ రావాల్సి ఉంది.
భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో పనిచేసేలా ప్రతి జిల్లాకు ఒక అధికార బృందాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 344 కిలోమీటర్ల మేర నిర్మించనున్న త్రిబుల్ ఆర్ ను రెండు భాగాలుగా నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక భూసేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరిస్తాయి. రోడ్డు నిర్మాణ వ్యయం మాత్రం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఉత్తర భాగం భూసేకరణతోపాటు నిర్మాణ వ్యయం అంతా కలిపి 7512 కోట్లు అవుతుందని అంచనాలు రూపొందించారు.