ఆ పథకాన్ని రేపే ప్రారంభించనున్న సీఎం జగన్

CM Jagan will launch the scheme tomorrow

0
32

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ..ఇప్పటికే జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం. అక్కచెల్లెమ్మల పేరిట ఉచిత ఇళ్ళ పట్టాలు, ఇళ్ళు మొదలైన పథకాల ద్వారా పేద అక్కచెల్లెమ్ములకు కల్పించడం ద్వారా వారి కాళ్ళ మీద వారిని నిలబెడుతూ సంక్షేమ ఫలాలు అందిస్తూ చరిత్ర సృష్టించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం… మహిళా సంక్షేమంలో మరో అడుగు ముందుకు వేస్తూ. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలు) లోని పేద అక్కచెల్లెమ్మలకు కూడా మేలు జరిగేలా వారి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా అందిస్తున్న కానుక వైఎస్సార్ ఈబీసీ నేస్తం.

రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమల తో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు 3,92,674 మంది పేద అక్క చెల్లెమ్మలకు రూ. 589 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ నేడు బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమల తోపాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు 3 ఏళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్థిక సాయం చేస్తూ వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు అందిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

అమ్మ కడుపులోని బిడ్డ నుండి…
ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు…అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం…

గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కొరకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా సంపూర్ణ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం పంపిణీ

నాడు నేడు ద్వారా కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, స్కూల్స్‌ లో ఫర్నిచర్‌, త్రాగునీరు, ప్రహారీగోడలు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు తదితర సదుపాయాలతో రూపురేఖలు మార్చడం మొదలు ఇంగ్లీషు మీడియం వరకు

స్వేచ్ఛ పథకం ద్వారా ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్‌ కిశోర బాలికలకు పంపిణీ

మహిళల భద్రత కోసం అభయం, దిశ యాప్‌లు

గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్ళ నియామకం

అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారి పేరు మీదే ఇళ్ళపట్టాలు, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు

1వ తరగతి నుండి 12 వ తరగతి వరకు పిల్లలను బడికి పంపే పేద తల్లులకు అమ్మ ఒడి ద్వారా ఏటా రూ. 15,000 ఆర్ధిక సాయం

గత ప్రభుత్వం మాఫీ చేస్తానని ఎగ్గొట్టిన పొదుపు సంఘాలలోని అక్కచెల్లెమ్మలను అప్పుల ఊబి నుంచి ఆదుకుంటూ దాదాపు రూ. 25 వేల కోట్ల రుణ బకాయిలను ఈ ప్రభుత్వమే నాలుగేళ్ళపాటు చెల్లిస్తూ వారి ఆర్ధికాభివృద్ది, సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్‌ ఆసరా…వారి రుణాలపై వడ్డీ భారాన్ని పూర్తిగా శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం

45 నుండి 60 ఏళ్ళ మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 18,750 నాలుగేళ్ళపాటు అదే అక్కచెల్లెమ్మలకు అందిస్తూ వారికి జీవనోపాధి అవకాశాలు కూడా కల్పించి వారి కాళ్ళపై వారు నిలబడేలా వైఎస్సార్‌ చేయూత ద్వారా తోడ్పాటు

కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15,000 ఆర్ధిక సాయం అందించే వైఎస్సార్‌ కాపు నేస్తం

60 ఏళ్ళు పైబడిన అవ్వలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక

నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు చేస్తూ చట్టం

కేబినెట్‌లో మహిళలకు కీలక శాఖల అప్పగింత, ఒక మహిళకు ఉప ముఖ్యమంత్రిగా, మరో మహిళకు హోంమంత్రిగా అవకాశం

స్ధానిక సంస్ధల పదవుల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 61 శాతం పదవులు

ఇవి కాక జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఆర్ధిక సాయం తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారి బిడ్డల ఉజ్వల భవితకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం

బెల్టుషాపుల రద్దు ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో సుఖశాంతులు

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం

ఇప్పుడు చెప్పకపోయినా, మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఓసీ (ఈబీసీ) పేద అక్క చెల్లెమ్మలకు కూడా వైఎస్సార్ ఈజీసీ నేస్తం పథకం ద్వారా ఏటా రూ. 15,000 అందివ్వడంతో, రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన 45 నుండి 60 ఏళ్ళ వయస్సుగల పేద అక్కచెల్లెమ్మలందరికీ లబ్ధి చేకూరుతుంది.

ఇక 60 ఏళ్ళు పైబడ్డ మహిళలకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా పెంచి ఇస్తున్న పెన్షన్‌లతో నెలకు రూ. 2,500 చొప్పున ఏటా రూ. 30,000 లబ్ధి కూడా ఎలాగూ అందిస్తున్న జగన్ ప్రభుత్వం.