ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు..త్వరలో నోటిఫికేషన్ జారీ!

Formation of new districts in AP ..!

0
111

ఏపీ​లో కొత్త జిల్లాల ఏర్పాటుపై వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. లోక్​సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని.. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు ఉద్యోగులంతా సమ్మెకు వెళ్తున్న సమయం, కేసినో మంటలు రేగుతున్న సమయంలో మరోసారి ఒకటి రెండు రోజుల్లో కొత్త జిల్లాలు అంటూ సీఎంవో అధికారులు మీడియాకు లీక్ ఇచ్చారు. ఇక నోటిఫికేషనే ఉందంటున్నారు. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చాలని నిర్ణయించారు. అతిపెద్దదిగా ఉన్న గిరిజన లోక్‌సభ నియోజకవర్గం అరకును.. రెండు జిల్లాలుగా చేయాలని ప్రతిపాదించారు. జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర, జిల్లాస్థాయిలోనూ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారి నుంచి క్షేత్రస్థాయిలోని అభ్యంతరాలు, వివాదాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చాలని ప్రతిపాదించారు.

మరోవైపు జనగణన ప్రక్రియ పూర్తి కాకుండా ప్రాంతాల భౌగోళిక స్వరూపం మార్చవద్దంటూ కేంద్ర ప్రభుత్వం 2020లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే.. వివిధ రాష్ట్రాల నుంచి అభ్యర్థనల దృష్ట్యా ప్రాంతాల పునర్విభజనకు 2022 జూన్ వరకూ కేంద్రం అనుమతి ఇచ్చింది. కొవిడ్ తీవ్రత దృష్ట్యా జనగణన ఆలస్యం కావటంతో..ఈ ప్రక్రియను కొనసాగించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. ఫలితంగా.. జిల్లాల పునర్విభజన ప్రక్రియపై నోటిఫికేషన్ జారీ చేయాలని..ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.