ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,08, 955కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.
అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో 12 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 561 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 101396 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 5716 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 1345
చిత్తూరు 436
ఈస్ట్ గోదావరి 1001
గుంటూరు 1422
వైస్సార్ కడప 1083
కృష్ణ 748
కర్నూల్ 1255
నెల్లూరు 1305
ప్రకాశం 1589
శ్రీకాకుళం 568
విశాఖపట్నం 1988
విజయవాడ 435
వెస్ట్ గోదావరి 644