2022 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో వారు చేసిన సేవలకు గానూ ఈ అవార్డులు అందిస్తోంది. పద్మ అవార్డులు పొందిన మొత్తం 128 మందిలో 34 మంది మహిళలు, 10 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. 13 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది.
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌ను మరణానంతరం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. కరోనా టీకాలు తయారు చేసిన సీరం, భారత్ బయెటెక్ సంస్థల ఛైర్మన్లకు పద్మ భూషణ్ అందించనుంది.
పద్మశ్రీ పొందిన వారిలో ప్రముఖులు
నీరజ్ చోప్డా
ప్రమోద్ భగత్
వందన కటారియా
సింగర్ సోనూ నిగమ్
పద్మ భూషణ్ పొందిన వారిలో ప్రముఖులు..
శ్రీ గులాం నబీ ఆజాద్(జమ్ముకశ్మీర్)
భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మ భూషణ్
సీరం ఛైర్మన్ సైరస్ పూనావాలా
బుద్ధదేవ్ భట్టాచార్య
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
పద్మ విభూషణ్ పొందిన వారు
ప్రభ ఆత్రే, మహారాష్ట్ర
శ్రీ రాధేశ్యామ్ ఖామ్కే(మరణానంతరం), ఉత్తర్‌ప్రదేశ్
జనరల్ బిపిన్ రావత్(మరణానంతరం), ఉత్తరాఖండ్.
శ్రీ కల్యాణ్ సింగ్(మరణానంతరం), ఉత్తర్‌ప్రదేశ్