భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుతుంది. క్రితం రోజుతో పోలిస్తే కరోనా కేసులు కాస్త తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. థర్డ్ వేవ్ కారణంగా గత కొద్ది రోజుల నుంచి రోజుకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
గురువారం రోజున దేశ వ్యాప్తంగా 2,51,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కానీ నిన్న మాత్రం దేశంలో 2.86 లక్షల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అంటే నిన్నటితో పోలిస్తే.. దాదాపు 30 వేల కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 627 కరోనా మరణాలు సంభవించాయి. అయితే కరోనా మరణాలు మాత్రం కాస్త పెరిగాయి.
అయితే గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. గురువారం ఒక్క రోజే 3,47,443 మంది కరోనా వైరస్ ను జయించారు. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21,05,611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,64,44,73,216 కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తన కరోనా బులిటెన్ లో తెలిపింది.
మొత్తం కేసులు: 4,06,22,709
మొత్తం మరణాలు: 4,92,327
యాక్టివ్ కేసులు: 21,05,611
మొత్తం కోలుకున్నవారు:3,80,24,771