తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

Good news for Thirumala devotees..TTD to release Darshan tickets

0
36

శ్రీవారి భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయాలని టీటీడి నిర్ణయించింది. ఈనెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్టు వెలువరించింది. ఆ మరుసటి రోజు అంటే జవనరి 29న ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. కరోనా నేథ్యంలో శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న సంగతి మనందరికీ  తెలిసిందే.

అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను విడుదల చేయడంతో అవి ఆన్‌లైన్‌లో ఉంచిన కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా బుక్ అయిపోతున్నాయి.దీంతో శ్రీవారి భక్తులు చాలా మందికి తీవ్ర నిరాశ మిగులుతుంది. అయితే ప్రస్తుతం కరోనా మరోసారి వేగంగా వ్యాప్తి చెందడం, కేసులు అధికంగా నమోదు కావడంతో.. ఈ నెల కూడా పరిమిత సంఖ్యలోనే టికెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. టికెట్లను బుక్ చేసుకోవడానికి భక్తులు.. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి నెలకు సంబదించిన తిరుమల శ్రీవారి దర్శన కోటాను నేడు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్టు టీటీడీ వెలువరించింది.నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లును ఆన్‌లైన్లో  ఉదయం 9 గంటలకు 29వ తేదీ సర్వదర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్ లో ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్న టీటీడీtirupatibalaji.ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.కరోనా కారణంగా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తప్పకుండా కోవిడ్ వ్యాక్సినేషన్, నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని టీడీడీ వెల్లడించింది.