తెలంగాణలో గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలు వస్తాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కెసిఆర్ తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రతిపక్ష నాయకులు చెప్పుకొచ్చారు. అయితే ముందస్తు ఎన్నికలపై తాజాగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో స్పందించారు. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవసరం అస్సలు లేదని, కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. తమకు 103 సీట్లు ఉన్నాయని… ఇలాంటి సమయంలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతామని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడానికి మా దగ్గర బ్రహ్మాండమైన మంత్రం ఉందన్నారు.