Flash: ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం

0
77

ఏపీలో గత కొద్దిరోజులుగా పీఆర్సీ రగడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల ఐదు నుంచి సహయ నిరాకరణ ఉద్యమం ప్రారంభిస్తామని ఏడు నుంచి సమ్మె మొదలు పెడతామని ప్రకటన చేశారు. విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమంలోకి వస్తున్నారని స్పష్టం చేశారు.

ఉద్యోగుల ఉద్యమం అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసి రావాలని.. ఉద్యోగ సంఘాలుగా చర్చలకు వెళ్లకుంటే పరిపక్వత లేదంటారా? అని ప్రశ్నించారు. పీఆర్సీ ఈ విధంగా ప్రకటించడం చరిత్ర.. ఈ ఉద్యమం కూడా చరిత్రే అంటూ స్పష్టం చేశారు.