కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే వాటిలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇంటికి దీపం అమ్మాయి అనే చైతన్యంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (ఎస్.ఎస్.వై) తీసుకొచ్చింది. ఇది చిన్న మొత్తాల పొదుపు పథకం. ఈ పథకం ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం 2014లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మీ చిన్నారి పేరున ఈ ఖాతాని ఓపెన్ చేయించచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ ఖాతాను తెరువవచ్చు.
బాలిక పుట్టిన పది సంవత్సరాల లోపు సుకన్య సమృద్ధి పొదుపు ఖాతాను తెరవాలి. అమ్మాయి భారతీయురాలై ఉండాలి. ఇక్కడ నివసించాలి. పొదుపు ఖాతాను అమ్మాయి పేరు మీదే తెరవాలి. ఒక కుటుంబంలో ఇద్దరు కూతుళ్లకు మాత్రమే ఈ పొదుపు ఖాతాను తెరిచే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం కొంత మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఖాతాను అమ్మాయి పేరు మీద తెరవవచ్చు. రూ.250తో ఖాతాను తెరవాలి. తర్వాత సంవత్సరానికి గరిష్టంగా 1,50,000 జమ చేయాలి. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 15 సంవత్సరాల వరకూ డబ్బు క్రమం తప్పకుండా జమ చేయాలి.
అలాగే, ఖాతాను ప్రారంభించిన తేదీ నుంచి అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేటప్పటికి ఆ ఖాతా మెచ్యూరిటీకి వస్తుంది. ఉదాహరణకు డిఫాల్ట్ లేకుండా నెలకు వెయ్యి రూపాయలు (ఈ డబ్బు ఒకేసారి జమ చేయాలని లేదు. నెలలో రెండు, మూడు దఫాలుగా కట్టొచ్చు) కడితే మెచ్యూరిటీ సమయానికి సుమారు 5 లక్షల రూపాయలు అందుతాయి. డిఫాల్ట్ లేకుండా నెలకు పన్నెండున్నర వేలు 15 ఏళ్ల పాటు కడితే, మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ. 71 లక్షల వరకూ వస్తుంది. సంవత్సరానికి రూ. 60 వేలు దఫదఫాలుగా కడితే మెచ్యూరిటీ సమయానికి 15 సంవత్సరాలకు వడ్డీ రేటును బట్టి రూ.28 లక్షలకు పైన వస్తుంది. అయితే ఈ స్కీమ్ నుండి డబ్బులు తీసుకోవాలంటే అమ్మాయికి పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాతనే తీసుకోవాలి. అప్పటి వరకు తీసుకోలేం.