నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆ పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం

Good news for the unemployed .. orders to replace those posts

0
98

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ మేరకు త్వరలో ఆ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటన చేశారు మంత్రి హరీష్‌రావు. రాష్ట్రంలోని ఏ దవాఖానలలో మందుల కొరత ఉండొద్దని మంత్రి పేర్కొన్నారు.

గతంలో ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుంబానికి 2 లక్షలు మాత్రమే వచ్చేది. సీఎం కేసీఆర్ ఈ లిమిట్ ను 5 లక్షలకు పెంచారని గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రిలో రూ.రూ. 10.91 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఓపీడీ బ్లాక్‌కు హరీశ్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం13 హార్సే వెహికల్స్ (పార్థీవ దేహాలను తరలించే వాహనాలు), 3 అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ప్రజా వైద్యంలో రూ. 1690 తలసరి ఖర్చు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో ఉందన్నారు.

వైద్య సేవల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుంది. అందుకు తగ్గట్టుగానే హైదరాబాద్‌ నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. త్వరలోనే గడ్డి అన్నారం హాస్పిటల్‌, చెస్ట్ ఆస్పత్రుల్లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రారంభించ పోతున్నాం’ అని మంత్రి చెప్పుకొచ్చారు.