మందుబాబులకు బిగ్ షాక్..సీఎం కీలక ఆదేశాలు

0
100

ఏపీ మందుబాబులకు సీఎం జగన్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ఏపీలోని అన్ని హైవేల పక్కన మద్యం దొరకకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో రహదారి భద్రతా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు.. హైవేల పక్కన మద్యం షాపులను క్లోజ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగైతేనే.. రోడ్డు ప్రమాదాలు ఆగుతాయన్నారు.

రోడ్డు భద్రతామండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రోడ్‌ సేఫ్ట్‌ కోసం లీడ్‌ ఏజెన్సీ ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన సీఎం జగన్.. పోలీసు, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్‌, రోడ్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి నిపుణులతో లీడ్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యంగా… రోడ్‌ సేఫ్ట్‌ ఫండ్‌ ఏర్పాటుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్‌లెస్‌ ట్రీట్‌ మెంట్‌ అందేలా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితాలోకి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి.. ఐరాడ్‌ యాప్‌ వినియోగించుకుని ప్రమాదాలపై లైవ్‌ అప్‌డేట్‌ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.