చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే సమస్యలు తప్పవు!

0
119
Woman using tissue

ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ చలికాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్న  అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే చలికాలంలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.అలాగే ఎలాంటి పనులు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం.

మనకు చలికాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. దీనితో ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. అయితే ఇలా అతిగా ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి తగ్గించండి మంచిది. చలికాలంలో ఎక్కువగా నూనెతో వండిన పదార్థాలను తీసుకోకూడదు.ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోకూడదు. దీనితో బరువు పెరిగి.. ఒబిసిటీకి కూడా దారితీసే అవకాశం ఉంది.
చలికాలంలో పంచదారను తగ్గిస్తే మంచిది. పంచదారని టీ, కాఫీ లో వేసుకోకుండా మానేయడం మంచిది.

అలాగే చలి కాలంలో ఉప్పుని ఎక్కువగా వాడద్దు. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి.చలికాలంలో రాత్రిపూట ఎక్కువ హెవీగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు.ఎక్కువగా ఆకుకూరలు, క్యారెట్లు, ముల్లంగి వంటివి తీసుకోండి. చలికాలంలో ఆరెంజ్, కివి, పైనాపిల్ వంటి పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.
అదే విధంగా చలికాలంలో రిఫైండ్ ఆయిల్ కి బదులుగా ఆవాల నూనె వాడండి. చలికాలంలో  ఈ మార్పులను పాటించడం వల్ల  ఆరోగ్యం మరింత బాగుంటుంది.