పార్లమెంటు ఉభయసభల కార్యక్రమాలను ప్రసారం చేసే సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. దుండగులు ‘ఇథీరియమ్(క్రిప్టో కరెన్సీ)’ అని పేరు కూడా మార్చారని సంసద్ టెలివిజన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యూట్యూబ్ యాజమాన్యం సంసద్ టీవీ అకౌంట్‌ను నిలిపివేసింది. యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అకౌంట్ బ్లాక్ చేసినట్లు తెలిపింది.