Flash: సంసద్​ టీవీ యూట్యూబ్ ఛానల్​ హ్యాక్​

0
39

పార్లమెంటు ఉభయసభల కార్యక్రమాలను ప్రసారం చేసే సంసద్​ టీవీ యూట్యూబ్​ ఛానల్​ హ్యాక్​ అయింది. దుండగులు ‘ఇథీరియమ్(క్రిప్టో కరెన్సీ)’​ అని పేరు కూడా మార్చారని సంసద్​ టెలివిజన్​ పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యూట్యూబ్​ యాజమాన్యం సంసద్​ టీవీ అకౌంట్​ను నిలిపివేసింది. యూట్యూబ్​ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అకౌంట్​ బ్లాక్​ చేసినట్లు తెలిపింది.