ఆధార్. ప్రతి భారతీయుని ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఇది ఒకటి. ఆధార్ తోనే స్కీమ్స్ మొదలు బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యడం దాకా ఎన్నో వాటికి ఆధార్ కార్డు కావాలి. అయితే ఆధార్ కార్డు లో కనుక ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఒకవేళ కనుక మీ ఆధార్ కార్డు లో అడ్రెస్ తప్పుగా ఉంటే దానిని కూడా మార్చుకోవాలి. మీ అడ్రెస్స్ లో కనుక ఏదైనా తప్పులు లేదా అప్డేట్స్ ఉంటే మీరు ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. సొంతంగా మీరు వివరాలను మార్చుకోచ్చు.
మీరే స్వయంగా అడ్రెస్ ని మార్చుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఉంటే చాలు. దీనితో ఈజీగా ఆధార్ కార్డ్ లో అడ్రెస్ ని మార్చుకోచ్చు. ఇక అడ్రెస్ ని ఎలా మార్చాలి అనేది చూసేద్దాం.
మీ ఆధార్ కార్డు లో అడ్రెస్ ని కనుక మార్చుకోవాలనుంటే ముందు అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని ఓపెన్ చెయ్యండి.
నెక్స్ట్ ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ ‘Update Address In Your Aadhaar‘ అని ఉంటుంది. దాని పైన క్లిక్ చెయ్యండి.
ఇప్పుడు మరో కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
మీకు కనిపించే క్యాప్చా ను సరిగా ఎంటర్ చెయ్యండి.
నెక్స్ట్ మీరు OTP అప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి OTP వస్తుంది.
OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి.
మరొక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Change/Update కోసం Address అప్షన్ పైన నొక్కండి.
ఇక్కడ మీరుమీ వివరాలను నింపి, మీ ఐడెండిటీ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి.
మళ్ళీ మరొక OTP వస్తుంది.
OTP ఎంటర్ చేసి Save అప్షన్ పైన క్లిక్ చెయ్యండి అంతే.