మనందరికీ ముఖ్యమైన డాక్యుమెంట్లలలో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఆధార్ కార్డు లేకపోతే మనం చేయవలసిన చాలా పనులు ఆగిపోతాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్‌ను అందిస్తోంది. వీటి వల్ల కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోంది. ప్రతి లబ్ది తప్పనిసరిగా ఆధార్ ప్రముఖమైనది. అయితే ఇటీవల ఒక స్కీమ్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక స్కీమ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తోందని ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వపు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. అంతే కాకుండా ఈ డబ్బులు పై సగం సబ్సిడీ కూడా లభిస్తోందని అందులో ఉంది. అయితే నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్ ని ఇస్తోంది..? నిజం ఎంత అనేది చూస్తే… ఆధార్ కార్డు కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం రెండు శాతం వడ్డీకే రుణాలు ఇవ్వడంలో నిజం లేదు, ఇది కేవలం ఫేక్ వార్త.
అలానే లోన్ సబ్సిడీ కూడా లభిస్తుంది అన్నది కూడా అబద్ధమే. అనవసరంగా ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దు. మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని స్వయంగా పీఐబీ ఫ్యాక్ట్ చెప్పింది. ఇలాంటి స్కీమ్స్ ఏమీ లేవని… కేంద్రం ఇలాంటి స్కీమ్స్ ని తీసుకు రాలేదని చెప్పింది. ఒకవేళ కనుక మీరు నమ్మరు అంటే మీ బ్యాంకు ఎకౌంట్ ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దు.