గుడ్ న్యూస్..మీ జీతం రూ.15 వేల..ఈ స్కీం మీ కోసమే!

Good news..your salary is Rs.15 thousand..this scheme is just for you!

0
93

మీ జీతం రూ.15 వేలు కంటే ఎక్కువ వస్తోందా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రూ.15 వేల కంటే ఎక్కువ వస్తున్న వారికి సరికొత్త పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చింది. దీనితో వారికి ఎంతో బెనిఫిట్ గా ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

అసంఘటిత రంగంలో పనిచేస్తూ రూ.15,000 లోపు వేతనం పొందుతున్నవారు ఎవరైనా ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు. లబ్ధిదారులకు ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ప్రతీ నెల కొంత మొత్తం ఈ స్కీమ్‌కు చెల్లించాలి. వయస్సును బట్టి జమ చేయాల్సిన మొత్తం మారుతుంది. కనీసం రూ.55 నుంచి రూ.200 మధ్య చెల్లించాలి. లబ్ధిదారులు ఎంత జమ చేస్తే ప్రభుత్వం కూడా వారి అకౌంట్‌లో అంతే మొత్తం జమ చేస్తుంది.

లబ్ధిదారులకు 60 ఏళ్ల నుంచి జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. లబ్ధిదారులు మరణిస్తే వారి జీవితభాగస్వామికి జీవితాంతం సగం పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో జమ చేసిన మొత్తానికి 8 శాతం వడ్డీ వస్తుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ కార్యాలయాలతో పాటు కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయాల్లో ఈ స్కీమ్‌లో చేరొచ్చు.