మామూలు కి’లేడి’ కాదు..ప్రముఖ యాక్టర్ పేరుతో మోసం..ఏం జరిగిందంటే?

0
95

రోజురోజుకూ మోసాలు పెరుగుతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకుని సామాన్యులను నిండా ముంచుతున్నారు మోసగాళ్లు. కొందరు ఆన్ లైన్ ను ఆసరాగా చేసుకుని ఖాతా లూటీ చేస్తున్నారు. మరికొందరు ప్రముఖుల పేర్లతో నయా మోసానికి పాల్పడుతున్నారు. మగవాళ్లే కాదు మేమేం తక్కువ అంటూ ఆడవాళ్లు మోసాలకు పాల్పడడం గమనార్హం. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ కి’లేడీ’ ప్రముఖ యాక్టర్ పేరుతో మోసాలకు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే..రమ్య రఘపతి అనే మహిళ ప్రముఖ యాక్టర్ నరేష్ పేరుతో డబ్బులు వసూలు చేస్తుంది. అతని పేరుతో హిందూపూర్ , హైదరాబాద్ లో భారీగా డబ్బులు వసూళ్లు చేసింది. ఈ విషయం తెలుసుకున్న నరేష్ రమ్య వసూళ్లతో సంబంధం లేదని వెల్లడించాడు. దీనితో రమ్యపై గచ్చిబౌలి పీఎస్ లో 5 గురు మహిళలు ఫిర్యాదు చేశారు. నరేష్ కుటుంబ ఆస్తులు చూపి డబ్బులు వసూల్ చేసిందని రమ్యపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.