దేశంలో రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. ప్రేమించలేదని, పెళ్ళికి నిరాకరించిందని, అక్రమ సంబంధం తదితర కారణాలతో హత్యలకు పాల్డపడుతున్నారు కిరాతకులు. తాజాగా ఉత్తర్ప్రదేశ్ బాగ్పత్లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో 20 ఏళ్ల యువతి గొంతు కోసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.