చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

0
75

5 వేల వేతనంతో పనిచేసే గ్రామ వలంటీర్లకు పిల్లను కూడా ఇవ్వరని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎకసెక్కాలాడుతున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా? లక్షల మందితో పోటీ పడి ఉద్యోగాలు సాధించిన వలంటీర్ సైనికులకు ఏం తక్కువని మీరలా అపశకునాలు పలుకుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు టీడీపీ నాయకులదని అన్నారు జగన్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నాడు చంద్రబాబు అని అరోపించారు . హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర ఆయనది. తన కుటుంబం, ‘సొంత మనుషుల’ కోసమే 40 ఏళ్లు ఆరాట పడ్డాడు.