ఘోరం..భాగ్యనగరంలో మరో గ్యాంగ్ రేప్

Ghoram..another gang rape in Bhagyanagar

0
107

దేశంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వావి వరసలు, చిన్న పెద్ద మరిచిన కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీరి దారుణాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. తాజాగా తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో మరో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..సంతోష్ నగర్ కు చెందిన ఓ మహిళకు రెండు రోజుల క్రితం రాజేంద్ర నగర్ పరిధిలోని సులేమాన్ నగర్ కి చెందిన సాజిత్ (27) అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు వాట్సాప్ నెంబర్లు షేర్ చేసుకొని చాటింగ్ చేసుకున్నారు. చాటింగ్ లో నూడ్ గా చాటింగ్ చేయమని కోరిన సాజీద్ అనే యువకుడు…ఆ తర్వాత నూడ్ చాటింగ్ ను రికార్డ్ చేశాడు. నూడ్ చాటింగ్ తో యువతిని బ్లాక్ మెయిల్ చేసిన సాజీద్…రాజేంద్రనగర్ లోని తన స్నేహితుడి గదికి రావాలని బెదిరించాడు… మాట్లాడుకుందాం అంటూ మహిళకు యువకుడు మాయమాటలు చెప్పి నమ్మించాడు.

యువకుడి మాటలు నమ్మిన మహిళ రాజేంద్ర నగర్ వెళ్లింది. సాజిద్ ఆ మహిళను బైక్ మీద ఎక్కించుకొని స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతని స్నేహితులు నలుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ యువతి సీక్రెట్ గా 100 డయల్ చేసింది. దీనితో రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గదిలో వున్న యువతిని కాపాడి అత్యాచారానికి పాల్పడ్డ సాజీద్ తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.