త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ చిట్కా ట్రై చేయండి!

0
96

మనలో ఎవరికి మాత్రం బరువు పెరగాలని ఉంటుంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారం కారణంగా బరువు పెరగడం అనేది ఇటీవల పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీంతో డైటింగ్‌లు అంటూ వ్యాయామాలు అంటూ జిమ్‌ల బాట పడుతున్నారు.

మనందరికీ అందుబాటులో ఉండే ఒక వెజిటబుల్ తో మనం త్వరగా బరువు తగొచ్చు. అది మన ఇంట్లో ఉంది అంటే..పొరుగింటి వారికి అడగకున్నా ఇచ్చేస్తుంటాం.అదే బూడిదగుమ్మడికాయ. ఈ బూడిదగుమ్మడి ఆరోగ్యానికి ఎంతో బాగా మేలు చేస్తుంది. బూడిదగుమ్మడి జ్యూస్ ను జీరో కాలరీ జ్యూస్ అని  అంటారట.

ఇందులో విటమిన్స్, మినరల్స్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. యాంటిఆక్సిడెంట్ జ్యూస్ గా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామందికి పొట్టలో మంట, యసిడిటీ, అల్సర్లు ప్రభావం ఎక్కువగా ఉంది. దీనివల్ల ఇరిటేషన్స్ కూడా వస్తున్నాయి. ఈ యాసిడ్సిస్ ను నూట్రలైజ్ చేయడానికి ఆల్కలిన్ జ్యూసెస్ కావాలి. నంబర్ వన్ ఆల్కలిన్ జ్యూస్ బూడిదగుమ్మడి జ్యూస్ మాత్రమే. ఇది పొట్టలో అల్సర్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.

అధికబరువు ఉన్నవారికి కూడా ఈ జ్యూస్ బాగా మేలు చేస్తుంది. బరువు తగ్గాలన్నా, కొవ్వుకరగాలన్నా కాలరీస్ ఎక్కువగా ఉండకూడదు. ఈ జ్యూస్ లో చాలా తక్కువ కాలరీస్ ఉంటాయి. తాగినప్పటికీ పొట్టఫుల్ అవుతుంది. విటమిన్స్, మినరల్స్ వస్తాయి. ఫైబర్ అందుతుంది. బాడీకి అనేక రకాల యాంటిఇన్ఫ్లమెంటరీ ప్రొపర్టీస్ వస్తాయి. కానీ వెయిట్ మాత్రం పెరగరు. వెయిట్ బాగా లాస్ అవ్వాలని అనుకున్నవారు..ఇతర వెజిటబుల్ జ్యూస్ కంటేకూడా..బూడిదగుమ్మడి జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే చాలు.

ఉదయంపూట కాఫీ,టీ, పాలు మానేసి..బూడిదగుమ్మడి ప్లెయిన్ జ్యూస్ తీసుకుని కావాలంటే..రెండు స్పూన్ల తేనె కలుపుకుని తాగొచ్చు.క్యాన్సర్ తో బాధపడేవారికి యాంటిక్యాన్సర్ గా కూడా ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది. అందరు వారంలో ఒక్కసారైనా తింటూ ఉంటే బాడీకి కావాల్సిన పోషకాలను అందించినట్లే అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.