ఐకేపీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేపట్టాలి- SERP ఉద్యోగ సంఘాల డిమాండ్

0
46

2018 టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం & తదుపరి గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న ప్రకారం ఐకేపీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తగిన కేటాయింపులు చేసి ప్రారంభించాలని SERP ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులు కుంట గంగాధర్ రెడ్డి, ఏపూరి నర్సయ్య మహేందర్ రెడ్డి, సుభాష్ గౌడ్, సుదర్శన్ లు ఒక సంయుక్త ప్రకటనలో కోరారు.

2018 ఎన్నికల మేనిఫెస్టోలో పేజి నెంబర్ 11 పాయింట్ నెంబర్ 16 ప్రకారం రెగ్యులరైజేషన్ కు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తదనంతరం ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా చేసిన ప్రసంగంలో ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని పునరుద్ఘాటించారు అన్నారు.

ప్రస్తుత బడ్జెట్లో సెర్ప్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పేస్కేలు అమలు కొరకు అవసరమైన బడ్జెట్ ను కేటాయించి రెగ్యులరైజేషన్ ప్రక్రియను SERP సంస్థ చైర్మన్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన కెసిఆర్ గారు స్వయంగా ప్రారంభించాలని జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఇందుకు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మున్సిపల్ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గార్లు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఇంక్రిమెంట్ 6% మరో వెయ్యి మంది ఉద్యోగులకు విడుదల చేయలేదని, సంబంధిత బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇదివరకే కలిసి విన్నవించామని, కావున అందరు ఎమ్మెల్యేలు మంత్రులు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఈ అంశాన్ని దృష్టిలోకి తీసుకువచ్చి ఇదే అసెంబ్లీ సమావేశాల్లో ఐకేపీ 4086 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవసరమైన కేటాయింపులు చేసి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది.. ధన్యవాదములు
ఇట్లు
కుంట గంగాధర్ రెడ్డి ఏపూరి నరసయ్య మహేందర్ రెడ్డి
సుభాష్ గౌడ్, సుదర్శన్..
TS SERP-IKP Employees State Union’s JAC