బ్రష్ ఎక్కువ సేపు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

0
91

మన రోజు వారి పనులలో ప్రతి రోజూ బ్రష్ చేయడం తప్పనిసరి. ఉదయం సాయంత్రం బ్రష్‌ చేయడం పళ్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు వైద్య నిపుణులు. ఏది ఏమైనా శుభ్రంగా పళ్ళు తోముకోవడం, నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, క్రిములుని తొలగించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని డెంటిస్ట్స్ కూడా సజ్జెస్ట్ చేస్తుంటారు. అయితే బ్రష్ చేసేటప్పుడు చాలా మంది ఎన్నో తప్పులు చేస్తుంటారు. కొన్ని సార్లు చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుంది. మరి బ్రష్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో? బ్రష్ ఎక్కువ సేపు చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా మనం బ్రష్ చేయడానికి పట్టె సమయం 5నిమిషాలు. అయితే కొంతమంది గంటల తరబడి బ్రష్ చేస్తుంటారు. మరికొంతమంది రఫ్ బ్రషింగ్ చేస్తారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల చాలా సమస్యలు ఎదురుకోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. చాలా సేపు బ్రషింగ్‌ చేయడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినడమే కాకుండా పళ్లు సెన్సిటివ్‌గా మారిపోయి త్వరగా పుచ్చిపోయే ప్రమాదముంది.

హార్డ్‌ బ్రషింగ్‌ వల్ల పళ్లు, చిగుళ్లు కూడా డ్యామేజ్‌ అవుతాయి. అందుకే ఎప్పుడూ మెత్తని బ్రష్‌ను ఉపయోగించమని వైద్యులు చెబుతారు. అలాగే రెండు నెలలకొకసారి టూత్‌ బ్రష్ మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా బ్రషింగ్‌ అనేది కేవలం 2 నుంచి 5 నిమిషాలలోపు ముగించాలని చెబుతున్నారు. చక్కగా మెరిసే దంతాలు ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటారు. అందుకని గంటలు తరబడి బ్రష్ చేస్తారు. కానీ ఇది చాలా పొరబాటు అంటున్నారు నిపుణులు. దంతాలతో పాటు చిగుళ్లు కూడా చాలా ముఖ్యమని, తరచూ చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే అది జాగ్రత్త పడమని మీకొక హెచ్చరిక అంటున్నారు. గట్టి పదార్ధాలు తినేటప్పుడు నెమ్మదిగా నమలడం మంచిదంటున్నారు.

ఇక ఇన్‌ఫ్లమేషన్ కారణంగా చిగుళ్లు పాడవ్వటం సర్వసాధారణమని, అయితే బ్రష్ చేశాక. చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఏదైనా తిన్నాక ఆహారపదార్థాలు పేరుకోకుండా తరచూ పుక్కిలించాలని సూచిస్తున్నారు..ఇక ఎనామిల్ దెబ్బతినకుండా ఉండాలంటే కొన్నింటిని పక్కన పెట్టడం చాలా అవసరం అంటున్నారు. ఇందులో సోడాలు, షుగరీ డ్రింక్స్‌, ఆల్కహాల్, ధూమపానం వంటివాటికి దూరంగా ఉంటే ఇంకా మంచిదని చెబుతున్నారు.