టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు..ఎప్పటి వరకు అంటే?

Huge discounts on Tata cars..for how long?

0
37

హోలీ పండుగను పురస్కరించుకొని టాటా కార్లపై భారీ డిస్కౌంట్​ ఆఫర్లు ప్రకటించింది. టాటా టియాగో, టిగోర్​, హ్యారియర్​ కార్లపై డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. మార్చి నెలలో ఈ కార్లను కొనుగోలు చేసిన వారికే మాత్రమే ఈ హోలీ ఆఫర్​ వర్తించనుంది.

ఎంవై 2021 మోడల్​లో వచ్చిన టాటా హ్యాచ్‌బ్యాక్ టియాగోపై రూ. 10,000 క్యాష్​ బ్యాక్​ను అందిస్తుంది. ఎంవై 2022 కార్ల కింద సుమారు రూ. 15 వేల వరకు క్యాష్​ బ్యాక్ కూడా ఇవ్వనుంది సంస్థ. దీనితో పాటు మరో రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపును కూడా వినియోగదారులు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్​లు కేవలం పెట్రోల్ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తాయిని సంస్థ తెలిపింది.

టాటా టిగోర్​ మీద కూడా ఇలాంటి డిస్కౌంట్​లు ప్రకటించింది సంస్థ. సుమారు రూ. 10 వేల వరకు క్యాష్​ బ్యాక్​ను అందిస్తుంది. ఎక్స్ఛేంజ్​ ఆఫర్​లో మరో రూ. 15 వేల క్యాష్​ బ్యాక్​ ఇవ్వనుంది. కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద మరో రూ. 3వేల వరకు అందస్తుంది. టిగోర్​లో కేవలం పెట్రోల్​ వేరియంట్లకే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి.

టాటా హ్యారియర్​ కార్లపై రూ. 20 వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​ ప్రకటించింది సంస్థ. ఎక్స్ఛేంజ్​ ఇన్​సెంటివ్​​ కింద రూ. 40 వేలు ఇస్తుంది. దీనిలో కూడా కార్పొరేట్​ డిస్కౌంట్​ రూ. 5 వేల వరకు ఉంది.

టాటా నెక్సాన్​ లోని ఐసీఈ డీజిల్ వేరియంట్ల​లో రూ. 15 వేల ఎక్స్ఛేంజ్​ బోనస్​ ఇవ్వనుంది. పెట్రోల్​ వేరియంట్లపై కూడా ఇదే ఆఫర్​ అందించనుంది. పెట్రోల్ వేరియంట్​లో రూ. 3 వేల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​ను అందిస్తుంది. డీజిల్​ వేరియంట్లపై ఈ డిస్కౌంట్​ రూ. 5 వేల వరకు ఉంది.