రాధేశ్యామ్​, ఆర్​ఆర్​ఆర్​ టికెట్లు..రికార్డు స్థాయిలో అడ్వాన్స్​ బుకింగ్స్​

0
41

ఓ వైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో జక్కన్న తెరకెక్కించిన సినిమా ‘RRR’ మరోవైపు. ఈ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ మార్చి 11న విడుదల కానుంది. RRR మార్చి 25న థియేటర్లలో సందడి చేయనుంది.

మార్చి 11న విడుదల కానున్న రాధేశ్యామ్ అమెరికాలో గ్రాండ్​గా రిలీజ్​ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 10న రికార్డు స్థాయిలో ప్రీమియర్​ షోలు ప్రదర్శన కానున్నాయి. 1,116 లోకేషన్లలో 11,116 షోలు వేయనున్నారు. అడ్వాన్స్​ బుకింగ్స్​ కూడా రికార్డు స్థాయిలో అవుతున్నట్లు తెలిసింది. కాగా ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్​ఆర్​’ కూడా విడుదలకు ముందే పలు రికార్డులను అందుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలో అడ్వాన్స్​ బుకింగ్స్​ ఓపెన్​ చేసిన 10 గంటల్లోనే దాదాపు 5 లక్షల డాలర్లను(హాఫ్​ మిలియన్​) సంపాదించింది. లండన్​లో ఒడియన్​ బీఎఫ్​ఐ ఐమాక్స్​లోనూ ‘ఆర్​ఆర్​ఆర్​’ ప్రదర్శనకానుంది.

యూకేలోనే ఇది అతి పెద్ద ఐమ్యాక్స్​ థియేటర్​ అవ్వడం విశేషం. కాగా, ఈ తెరపై ప్రదర్శనకానున్న తొలి భారతీయ చిత్రం కూడా ఇదే. యూకేలో దాదాపు 1000 స్క్రీన్లపై ‘ఆర్​​ఆర్​ఆర్​’​ రిలీజ్​ కానున్నట్లు తెలిసింది. ఈ మూవీలో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్​ దేవగణ్​, ఆలియా భట్​, శ్రియ కీలక పాత్రలో నటించారు.