తెలంగాణలో మందుబాబులకు శుభవార్త..తగ్గనున్న ధరలు?

Good news for Mandubabs in Telangana..all prices going down?

0
104

మందుబాబులకు తెలంగాణ సర్కార్ త్వరలో శుభవార్త చెప్పబోతున్నట్టు సమాచారం. త్వరలోనే లిక్కర్ రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు వచ్చాయి. లిక్కర్ ధరలు తగ్గించి సేల్స్ పెంచే దిశగా అబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. కెసిఆర్ ప్రభుత్వం ఆమోదం వస్తే కొత్త రేట్లు వచ్చే నెల నుంచి అమలులోకి ఛాన్స్ ఉంది.

బీరు మినహా ఇండియాలో తయారయ్యే లిక్కర్ బాటిల్ లో పై స్వల్పంగా ధర తగ్గించడం ద్వారా అమ్మకాలు పెంచాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది 20 శాతం వరకు లిక్కర్ రేటు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అన్ని రాష్ట్రాల్లో రేట్లు పెంచి.. ఆ తర్వాత తగ్గించినా మన దగ్గర మాత్రం తగ్గించలేదు.

ఇటీవల కాలంలో బీర్ల సేల్ తగ్గడంతో.. ఒక్కో బాటిల్ 10 రూపాయలు తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ లిక్కర్ బాటిల్ లపై ధరలపై మాత్రం తగ్గించలేదు. అయితే వీటి అమ్మకాలను పెంచేందుకు ఒక్కో బాటిల్ పై పది రూపాయలు తగ్గించేందుకు అధికారులు సన్నద్ధం అయినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.