స్పిన్‌ దిగ్గజం షేన్ వార్న్‌ చివరి క్షణాలు ఇవే..

0
38

స్పిన్‌ దిగ్గజం షేన్​ వార్న్​ మృతి యావత్ క్రికెట్​ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 52 ఏళ్ల ఆయన శుక్రవారం గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందారు. థాయ్‌లాండ్‌లో విహారంలో ఉన్న ఆయన మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో వార్న్‌ మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ బయటపెట్టారు.

మ్యాచ్‌ల వ్యాఖ్యానం కోసం ఇంగ్లాండ్‌ వెళ్లే ముందు దొరికిన సమయాన్ని గడిపేందుకు వార్న్‌ థాయ్‌లాండ్‌లో ఉన్నాడు. ఆ సమయంలో వార్న్​ మద్యం తీసుకోలేదు. తన స్నేహితుడు నియోఫిటోను కలిసి భోజనం చేద్దామనుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మరికొంత మందిని వార్న్‌, నియోఫిటో కలవాలనుకున్నారు. పక్క గదిలోనే ఉన్న నియో వచ్చేసరికి వార్న్‌ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతనికి ఏదో అయిందని నియో భావించాడు. నోటిలో నోరు పెట్టి శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించాడు. హృదయ స్పందన లేకపోవడంతో సీపీఆర్‌ చేశాడు.

20 నిమిషాల తర్వాత అంబులెన్స్‌ వచ్చింది. ఓ గంట తర్వాత వార్న్‌ చనిపోయారనే విషయం తెలిసింది. ఆయన రెండు గంటల ముందు చివరగా చూశా. ఎక్కువగా మద్యం తాగడం లేదు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటిస్తున్నారు” అని సుదీర్ఘ కాలంగా వార్న్‌ మేనేజర్‌గా ఉన్న జేమ్స్‌ చెప్పారు.