బెంగాల్ లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. నూరేళ్లు తోడుగా ఉంటాడనుకున్న భర్తే కామాంధుడిలా మారాడు. తన స్నేహితులతో కలిసి కట్టుకున్న భార్యనే చెరిచాడు. బీహర్ కు చెందిన ఓ మహిళపై ఇంట్లోనే భార్యపై భర్తే తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటన గురువారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.