యూపీ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారంటే?

0
69

యూపీ ఎన్నికల ఫలితాలపై AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో ఓడిన అన్ని పార్టీలు ఈవీఎంలపై నిందలు వేస్తున్నారు. కానీ ఇది ఈవీఎంల సమస్య కాదు. ప్రజల మైండ్లో ఉన్న ఆలోచనల చిప్ సమస్య అన్నారు. యూపీ ప్రజలు బీజేపీకి అధికారం అప్పగించాలని ముందే డిసైడ్ అయ్యారు. అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయి.  రేపట్నుంచి తిరిగి పని చేస్తాం. వచ్చేసారి గెలుస్తామని ఆశిస్తున్నాం. MIM పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని ఓవైసీ పేర్కొన్నారు.